రైతు పేరు : సోమిరిపల్లి లక్ష్మమ్మ
గ్రామం  :రేకులకుంట
మండలం  : బ్రహ్మంగారిమఠం
జిల్లా   : YSR కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్

 

 సమస్య :  బ్రహ్మంగారిమఠం మండలంలోని రేకులకుంట పంచాయతీ, లక్ష్మి బాలాజీ నగర్ గ్రామానికి చెందిన సోమిరిపల్లి చెంద్రాయుడు గారికి ప్రభుత్వం డి.కే.టి పట్టా ఒక ఎకరం భూమిని ఇచ్చారు, ఆ భూమిలో అన్ని రాళ్లు ఉండేవి, వాటిని అని తొలగించి ఆ భూమిని సాగులోకి తెచ్చారు.

  • చెంద్రాయుడు గారికి ముగ్గురు కూతుర్లు, అందరూ ఆడపిల్లల కావడం వలన అందరికీ పెళ్లి చేసి పంపించారు. చెంద్రాయుడు గారు చనిపోయిన తరువాత అతని పేరు మీద ఉన్న భూమిని, అతని భార్య లక్ష్మమ్మ పేరు మీద భూమి బదలాయింపు చేసుకోవడానికి  బ్రహ్మంగారిమఠం మీసేవ కేంద్రంలో మరియు తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు కానీ, భూమి లక్ష్మమ్మ పేరు మీదకు బదిలీ అవ్వలేదు అని  ఆవేదన వ్యక్తం చేసింది.

కిసాన్ మిత్రా చేసిన పని : రేకులకుంట పంచాయతీ, లక్ష్మి బాలాజీ నగర్ గ్రామంలో కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ గురించి ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ  లక్ష్మమ్మ  భూమి సమస్య గురించి కిసాన్ మిత్ర కార్యకర్తలకు  చెప్పడం జరిగింది.

  • కిసాన్ కిసాన్ మిత్ర కార్యకర్త ఆమె సమస్య గురించి రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకెళ్లగా, వారు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ లక్ష్మమ్మ పేరు మీదకు భూమి బదలాయింపు కాలేదు, స్పందన ప్రోగ్రాం లో లక్ష్మమ్మ భూమి సమస్య గురించి తహసీల్దార్ దగ్గర ఫిర్యాదు చేయగా, ఆ సమస్య పరిష్కారం జరిగే  వరకు అధికారులతో భూమిని మార్చేందుకు ప్రయత్నలు చేయగా చివరకు గ్రామ రెవెన్యూ అధికారి నరసింహులు గారి ద్వారా చెంద్రయుడు పేరున వున్నా భూమిని లక్షుమ్మ పేరుతో మార్చడం జరిగింది.

సోమిరిపల్లి లక్షుమ్మ అబిప్రాయం : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి కాల్ చేసిన తరువాత  కిసాన్ మిత్ర టీం నాకు పాస్ బుక్ వచ్చేవరకు నా వెంటే ఉండి సహాయం చేశారు.భూమి పాస్ బుక్ రావడం వల్ల నాకు బ్యాంకు లోను  70000/-  రూపాయలు, తర్వాత క్రాప్ లోన్ రెన్యువల్ లో 90000/- చేయించడం జరిగింది. వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని చెప్పింది.