రైతు పేరు :  బాయికాడి సునీత  

గ్రామం పేరు : తాళ్ళమాపురం 

మండలం పేరు : ప్రొద్దుటూరు

జిల్లా పేరు  : YSR కడప

 

సమస్య : ప్రొద్దుటూరు మండలం, తాళ్ళమాపురం గ్రామంలో నివాసం ఉన్న బాయికాడి సునీత  (30) భర్త కమాల్ బాషా కుటుంబం వృత్తి రీత్యా వ్యవసాయం మరియు బేల్దారి పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు మహమ్మద్ రియాజ్(7వ తరగతి) నారాయణ స్కూల్ చదువుతున్నాడు, కూతురు ఆలీషా(5వతరగతి) జెడ్.పి.పి స్కూల్ ప్రొద్దుటూరు నందు చదువుతుంది. ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం పాఠశాలల్లో డ్రాపౌట్స్ సంఖ్యను గణనీయంగా తగ్గించే మంచి ఉద్దేశ్యంతో 2019 సంవత్సరంలో జగనన్న అమ్మఒడి అనే సంక్షేమ పథకం ప్రవేశపెట్టారు. అలాగే పిల్లల్ని చదివించేందుకు తల్లులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో గౌరవ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి తల్లికి అక్షరాల 15000/- చొప్పున నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలో వేస్తారు. ఈ పథకం కుటుంబంలో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఈ పథకంలో భాగంగా ఆలీషా స్థానిక వాలంటీర్ ద్వారా సచివాలయంలో నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న తర్వాత ముందస్తు లిస్టులో వీరు అనర్హులుగా వున్నారు అని సచివాలయ సిబ్బంది ద్వారా సునీత గారికి తెలియజేశారు. రిజెక్ట్ చేయడానికి కారణం అడుగగా,  కరెంటు వినియోగం వాడవలసిన మోతాదు కంటే ఎక్కువ వినియోగిస్తున్నందున మీరు ఈ పధకానికి అనర్హులు అని తేల్చి చెప్పారు. సునీత గారికి ఏమి చేయాలో తోచక అలానే ఉండిపోయారు. ఎందుకంటే స్థానిక వాలంటీర్ తర్వాత ఎలా మళ్ళీ నమోదు చేయడానికి తగిన సూచనలు ఇవ్వలేదు. ఒకరోజు తాళ్ళమాపురం యఫ్.పి.ఓ ఆఫీస్ లో కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ మీటింగ్ కి వచ్చిన సునీత గారు తమ అమ్మఒడి సమస్యను కిసాన్ మిత్ర టీంకి తెలియజేశారు అప్పుడు వారికి కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి కాల్ చేయాలని సూచించడం జరిగింది.

కిసాన్ మిత్రా చేసిన పని : ఈ సమస్య గురించి కిసాన్ మిత్ర దృష్టికి రావడంతో 2022 జూలై 5వ తేదీ కిసాన్ మిత్ర ఫీల్డ్ టీం మరియు ఇతర సిబ్బంది కలిసి వారి కుటుంబాన్ని కలవడం జరిగింది.  వారికి రావలసిన అమ్మఒడి డబ్బులు రాకపోవడానికి గల కారణాలు తెలుసుకొని, స్థానిక  పంచాయతీ  సెక్రటరీ మరియు డిజిటల్ అసిస్టెంట్ వారు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు కానీ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయించాలంటే అంతలోపు పథకం గడువు అయిపోతుంది,  అందువలన వెంటనే ప్రొద్దుటూరు విద్యుత్ శాఖ అధికారిని కలిసి కరెంట్ బిల్లు ఎందుకు ఎక్కువ వచిందో హిస్టరీ ఇవ్వాలని కోరడం జరిగింది,  అందుకు వారు సానుకూలంగా స్పందించి హిస్టరీని అప్పటికప్పుడే చెక్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ను మళ్ళీ స్థానిక సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ సమక్షంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అమ్మఒడి కోసం రిక్వెస్ట్ చేయగా అందరితోపాటు సునీత గారి బ్యాంకు ఖాతాలో 15000/- డబ్బులు జమ అయింది.

రైతు బాయికాడి సునీత  గారి అభిప్రాయం : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి 2022 జూలై 5వ తేది తేది న ఫోన్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించడంలో కిసాన్ మిత్ర టీం ఇతర సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందించి అమ్మఒడి వచ్చేలా కృషి చేసారు,  వారికీ ధన్యవాదాలు…