రైతు పేరు : యం.చిన్న వెంకట్ రెడ్డి
గ్రామం పేరు : భూమయ్యగారిపల్లి
మండలం పేరు : వేముల
జిల్లా : వై.యస్.ఆర్.కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్

                 

 

సమస్య :  వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని రైతు యం.చిన్నవెంకటరెడ్డి గారు తనకున్న 3 ఎకరాలలో  అరటి, శనగ పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సాగు పెట్టుబడి కోసం రైతులకు అందిస్తున్న రైతు భరోసా డబ్బులు 2019 నుండి పెండింగ్ లో ఉండడంతో రైతు చిన్న వెంకట్ రెడ్డి భూమయ్యగారిపల్లి రైతు భరోసా కేంద్రం వెళ్లి అగ్రికల్చర్ అసిస్టెంట్ తో మాట్లాడి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న తర్వాత APGB బ్యాంక్ లో NPCI లింక్ చేయడం కోసం డాక్యుమెంట్స్ 3 సార్లు ఇవ్వడం జరిగింది.  కానీ NPCI లింక్ కాకపోవడంతో రైతు భరోసా డబ్బులు రావడం లేదు. కిసాన్ మిత్ర టీమ్ భూమయ్యగారిపల్లి వెళ్లి కిసాన్ మిత్ర  హెల్ప్ లైన్ గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించినప్పుడు, ఈ రైతు రైతుభరోసా అమౌంట్ రావడం లేదు అని కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం జరిగింది.

కిసాన్ మిత్ర టీమ్ చేసిన పని : భూమయ్యగారిపల్లి  వెళ్లి రైతు చిన్న వెంకట్ రెడ్డి గారికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ సంతోషిని కలిసి,  రైతు భరోసా కోసం గ్రీవెన్స్ చేయించడం జరిగింది. తరువాత వేముల APGB బ్యాంక్ లో NPCI లింక్ కోసం డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది,  కానీ రైతు భరోసా డబ్బులు రాకపోవడంతో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చెన్నారెడ్డి సార్ మరియు జిల్లా అగ్రికల్చర్ ఆఫీస్ లో రైతు భరోసా మరియు పియం కిసాన్ విభాగానికి చెందిన మమత మేడం ను కలిసి ఈ రైతు సమస్య గురించి  మాట్లాడడం జరిగింది. NPCI లింక్ కాని వారికి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే NPCI లింక్ ఆటోమేటిక్ గా వస్తుంది చెప్పడంతో భూమయ్యగారిపల్లి పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయించడంతో  NPCI లింక్ అయ్యి మూడు సంవత్సరాల తరువాత రైతు భరోసా డబ్బులు రావడం జరిగింది

రైతు యం.చిన్న వెంకటరెడ్డి గారి స్పందన : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం ద్వారా, గత మూడు సంవత్సరాలుగా వ్యవసాయ అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగిన పరిష్కారం కానీ రైతు భరోసా పెండింగ్ సమస్య ను పరిష్కరించి రైతు భరోసా డబ్బులు ఇప్పించినందుకు కిసాన్ మిత్ర టీమ్ కు ప్రత్యేక ధన్యవాదాలు.