రైతు పేరు.     : కాల్వ నాగభూషణం 
గ్రామం          : చక్రాయపేట
మండలం      : చక్రాయపేట
జిల్లా.           : వై.యస్.ఆర్.కడప
రాష్ట్రం :  ఆంధ్రప్రదేశ్

సమస్య : చక్రాయపేట మండలంలోని చక్రాయపేట గ్రామంలో రైతు నాగభూషణం కు సర్వే నెంబర్ 863/3 లో 3.60 ఎకరాల డికెటి భూమి ఉంది కానీ డిపట్టా లేదు. ఈ రైతు తో పాటు 17 మంది రైతులకు డి పట్టాలు లేనందు వలన రైతు భరోసా రాలేదు. ఆ రైతులు మండల అగ్రికల్చర్ అధికారికి తెలియజేయగా మేము గ్రీవెన్స్ చేశాము కానీ మండల రెవిన్యూ అధికారి లాగిన్ లో పెండింగ్ ఉందని తెలపగా,  యం.ఆర్.ఓ దేవానందం సార్ గారికి తెలపగా డి పట్టాలు ఉంటేనే రైతు భరోసా వస్తుంది లేదంటే రాదని తెలిపినారు. ఈ సమస్య గురించి సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం జరిగింది.

కిసాన్ మిత్ర చేసిన పని : సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర టీం రైతు నాగభూషణం మరియు 17 మంది రైతులతో కలిసి యం.ఆర్.ఓ దేవానందం సార్ గారిని కలిసి రైతు భరోసా అనేది సాగు పెట్టుబడి ఖర్చు కింద రైతుకు ఇస్తున్నారు కాబట్టి రైతు భూమి పాస్ బుక్ కలిగి ఉండి, ఆన్లైన్ లో 1బి ఉండి మరియు పంట సాగు చేసిన ప్రతి రైతు కు రైతు భరోసా రావాలని కదా కాబట్టి వీరికి రైతు భరోసా అందించమని తెలపగా డిపట్టాలు ఉంటేనే ఆఫీస్ లోకి రండి లేదంటే వెళ్ళమని చెప్పడం జరిగింది.

  • తరువాత డిసెంబర్ 19 2020 న కలెక్టర్ శ్రీ హరికిరణ్ సార్ గారు మరియు కడప యం.పి వై.యస్. అవినాష్ రెడ్డి సార్ గారు చక్రాయపేట మండలంలోని మరేళ్ళమడక సచివాలయం కు వచ్చినప్పుడు కిసాన్ మిత్ర టీం కలిసి రైతులకు డి పట్టా లేకపోవడం వలన రైతు భరోసా పెండింగ్ సమస్య గురించి కలెక్టర్ హరికిరణ్ సార్ మరియు యం.పి.అవినాష్ రెడ్డి సార్ గారికి తెలియజేయగా అక్కడే యం.ఆర్.ఓ. గారిని పిలిచి రైతు భరోసా కు డి.పట్టా తో సంబంధం లేదు రైతుకు భూమి పాస్ బుక్ ఉండి, ఆన్లైన్ లో 1బి ఉండి మరియు పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలని చెప్పడం జరిగింది.
  • తరువాత యం.ఆర్.ఓ సార్ లాగిన్ లో ఉన్న అందరి రైతులకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం 17 మంది రైతులకు 10 జనవరి 2020 వ తేదీన రైతు భరోసా 7500/- డబ్బులు రావడం జరిగింది. ఈ గ్రామంలోని 17 మంది రైతులతో పాటుగా మండలంలో దాదాపు మొత్తం 240 మందికి రైతు భరోసా పెండింగ్ ఉన్న డబ్బులు రావడం జరిగిందని రైతు భరోసా కేంద్రం VHA లలిత మేడం చెప్పడం జరిగింది.

రైతు నాగభూషణం గారి స్పందన : ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతు భరోసా కోసం అధికారుల చుట్టూ తిరిగిన కూడా డిపట్టా ఉంటేనే రైతు భరోసా వస్తుంది లేకపోతే రాదని తెలిపినారు. కానీ కిసాన్ మిత్ర టీం ద్వారా కలెక్టర్ సార్ గారితో మాట్లాడి మా గ్రామంలోని 17 మంది రైతులకు మరియు మండలం మొత్తం 240 మంది రైతులకు రైతు భరోసా పెండింగ్ సమస్య పరిస్కారం చేసినందుకు కిసాన్ మిత్ర టీం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.